ఫ్యామిలీ, టూరిస్ట్ ప్రవేశ వీసాల జారీపై ఖతార్ కీలక నిర్ణయం!
- July 09, 2021
దోహా: ఫ్యామిలీ,టూరిస్ట్ ప్రవేశ వీసాల జారీపై ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది.జూలై 12 నుండి ఈ వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేసింది.కోవిడ్ -19 పరిణామాలకు సంబంధించి ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఆమోదించబడిన ప్రయాణ నిబంధనలకు లోబడి ఈ నిర్ణయం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక ఖతార్‌కు తిరిగి వచ్చే దేశ పౌరులు,నివాసితులు ఎంట్రీకి 14 రోజుల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటే క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
అలాగే ఖతార్ ఆమోదించిన వ్యాక్సిన్ తీసుకున్న సందర్శకులు ప్రవేశానికి 14 రోజుల ముందు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే వారికి కూడా క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.అంతేగాక ప్రయాణికులందరూ జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది.దేశాలను మూడు వర్గాలుగా వర్గీకరించిన తరువాత పౌరులు, నివాసితులకు క్వారంటైన్ నియమాలు నిర్ణయించబడతాయని పేర్కొంది.దేశాలను ఎరుపు, పసుపు,ఆకుపచ్చ కేటగిరీలుగా వర్గీకరించారు.వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు వారు ప్రయాణించే దేశాలపై ఆధారపడి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉంటుందని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







