నిలిచిన వర్షం నీళ్ళతో మునిగిన షేక్ జాయెద్ రహదారి

- March 09, 2016 , by Maagulf
నిలిచిన వర్షం నీళ్ళతో మునిగిన షేక్  జాయెద్ రహదారి

కుండపోత వర్షం ధాటికి జాతీయ రహదారులు జల సంద్రాలుగా మారాయి. షేక్  జాయెద్ రహదారిపై  నీళ్లు ఎక్కువ మొత్తంలో నీలిచిపోయిన  కారణంగా వాహనదారులు గజిబిజి ట్రాఫిక్ లో ఇరుక్కొన్నారు. దీంతో   షెక్  జాయెద్ రహదారిని కొంతకాలం నివారించాలని దుబాయ్ రహదారులు  మరియు రవాణాశాఖ  (ఆర్.టి.ఎ ) కోరారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలైన  షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రహదారులను వాహనదారులు ఉపయోగించాలని వారు  అభ్యర్దన చేశారు. ఈ సందర్భంగా వారు ట్వీటర్లో పేర్కొంటూ, అబూధాబీ నుంచి వెళ్ళేవారు...వచ్చేవారు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ & ఎమిరేట్స్ రోడ్డుని ఉపయోగించుకోవాలని కోరారు. ఇందుకు కారణం ప్రస్తుతం అక్కడ ఎక్కువ మొత్తంలో వర్షం నీళ్ళు నిలిచి ఉండటమే ఇందుకు ముఖ్య కారణమని తెలిపారు.   దుబాయ్ రహదారులు  మరియు రవాణాశాఖ  (ఆర్.టి.ఎ )  ట్రాఫిక్ పునరుద్ధరణకు ఎంతో శ్రమిస్తున్నారు. ఈ సందర్భం తమతో సహకరిస్తున్న రహదారి వినియోగదారులకు ధన్యవాదాలు తెలియచేశారు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న జాప్యాలకు క్షమాపణలు తెలియచేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com