వ్యాక్సిన్ తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు నో హోటల్ క్వారంటైన్
- July 10, 2021
ఖతార్: ఇతర దేశాల నుంచి ఖతార్ తిరిగొచ్చే పౌరులు, ప్రవాసీయుల క్వారంటైన్ నిబంధనలను సవరిస్తూ ఖతార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు హోటల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోని 18 ఏళ్లలోపు వాళ్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. గ్రీన్ లిస్ట్ లో లేని దేశాల నుంచి వచ్చే వారు కూడా పేరెంట్స్ వ్యాక్సిన్ పొందినట్లైతే పిల్లలకు హోటల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వారం పాటు హోం క్వారంటైన్ లో మాత్రం ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు హోటల్ క్వారంటైన్ నుంచి మరికొన్ని వర్గాల పౌరులు, ప్రవాసీయులకు మినహాయింపు ఇచ్చింది.
- ఖతార్లో సెకండ్ డోస్ తీసుకున్న వారికి హోటల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. సెకండ్ డోస్ తర్వాత వారు విదేశాలకు వెళ్లి తిరిగొచ్చే నాటికి 14 రోజులు పూర్తి కాకుంటే వారం పాటు హోం క్వారంటైన్లో ఉండాలి.
- 75 ఏళ్లు, అంతకుమించిన వయసు వారికి కూడా హోటల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని వృద్ధులు హోం క్వారంటైన్లో ఉండాలి. అయితే అతనికి సాయంగా అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి అనుమతి ఉంటుంది.
- ఖతార్ తిరగొచ్చే గర్భిణిల భర్తలు, లేదా వారి రక్తసంబధీకులు వ్యాక్సిన్ తీసుకుంటే వారికి మినహాయింపు ఉంటుంది.
- రెండేళ్లు, అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల తల్లులకు, భర్త లేదా వ్యాక్సిన్ తీసుకున్న ఇతర రక్తసంబంధీకులకు మినహాయింపు ఇచ్చారు.
- చికిత్స కోసం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చే వారికి, పేషెంట్ కు సాయంగా వెళ్లిన వ్యక్తికి హోటల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే..దీనికి కొన్ని షరతులను బట్టి మినహాయింపు వర్తిస్తుంది. ఆరోగ్యశాఖ దగ్గర ఉన్న సమాచారం మేరకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







