ప్రత్యేక విమానాల్లో యూఏఈ చేరుకున్న 73 మంది ఆస్టర్ వైద్య సిబ్బంది
- July 10, 2021
దుబాయ్: కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై కొనసాగుతున్న ఆంక్షల కారణంగా స్వదేశంలో చిక్కుకున్న 73 మంది భారత వైద్య సిబ్బంది ఎమిరేట్స్ ప్రత్యేక విమానాల్లో బుధవారం యూఏఈ చేరుకున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ(DHA) ప్రత్యేక అనుమతితో వీరు యూఏఈ వెళ్లారు.DHA గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో 73 మంది హెల్త్‌కేర్ వర్కర్లు రెండు గ్రూపులుగా బుధవారం యూఏఈ వచ్చినట్లు వారు పనిచేసే దుబాయ్‌లోని ఆస్టర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ తెలిపింది. విమానాలపై నిషేధం విధించడంతో తమ సంస్థకు చెందిన సుమారు 250 మంది వైద్య సిబ్బంది భారత్‌లో చిక్కుకున్నట్లు ఆస్టర్ పేర్కొంది. తాజాగా వీరిలో మొదటి బ్యాచ్‌లో 73 మంది(వైద్యులు, నర్సులు, పారామెడిక్స్) యూఏఈకి చేరుకున్నారని ఆస్టర్ వెల్లడించింది.

ఈ నెల 7న భారత్‌లోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరీ, మహారాష్ట్ర, హైదరాబాద్, మధ్యప్రదేశ్, కొచ్చిన్, బెంగళూరు నుంచి తమ సంస్థకు చెందిన హెల్త్‌కేర్ వర్కర్లు రెండు ప్రత్యేక విమానాల్లో యూఏఈ చేరుకున్నట్లు ఆస్టర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ సీఈఓ డా. షెర్బాజ్ బిచు వెల్లడించారు.ఈ సందర్భంగా తమ వైద్య సిబ్బంది తిరిగి యూఏఈ చేరుకోవడంలో సహకరించిన దుబాయ్ ప్రభుత్వం, దుబాయ్ హెల్త్ అథారిటీ, దుబాయ్ ఎయిర్‌పోర్టు అథారిటీ , ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు ఆస్టర్ యాజమాన్యం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.ఇక కరోనా నేపథ్యంలో యూఏఈ జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) ఏప్రిల్ 24 నుంచి భారత విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







