తారు కంటైనర్లో 25,000 పోగాకు ప్యాకేట్ల పట్టివేత

- July 10, 2021 , by Maagulf
తారు కంటైనర్లో 25,000 పోగాకు ప్యాకేట్ల పట్టివేత

కువైట్: చూయింగ్ పోగాకు ప్యాకెట్ల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని బట్టబయలు చేశారు కువైట్ కస్టమ్స్ అధికారులు. అనుమానం రాకుండా తారు కంటైనర్లో చూయింగ్ టోబాకోను దాచి కువైట్లోకి అక్రమంగా రవాణా చేయాలన్నది స్మగ్లర్ల ప్లాన్. కానీ, సుయిబా ఒడరేవులో కస్టమ్స్ అధికారులు కంటైనర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయటంతో అసలు గుట్టు బయటపడింది. 40 అడుగుల కంటైనర్ లో దాదాపు 25,000 చూయింగ్ టొబాకో ప్యాకెట్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన కంటైనర్ భారత్ నుంచి దుబాయ్ జెబెల్ అలి ఒడరేవు మీదుగా కువైట్ చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com