వీర జవాన్ జశ్వంత్ రెడ్డి భౌతిక కాయానికి సైనిక లాంచనాలతో అంత్యక్రియలు
- July 10, 2021
ఏపీ: బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంలో వీర సైనికుడు జశ్వంత్ రెడ్డి భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరిగాయి.హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని, జెసి దినేష్ కుమార్ తదితరులు జశ్వంత్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీర జవాన్ జశ్వంత్ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. జశ్వంత్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్ ను హోంమంత్రి అందచేశారు. అతి చిన్నవయస్సులో జశ్వంత్ మరణించడం చాలా బాధాకరమనీ హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం జశ్వంత్ రెడ్డి చేసిన త్యాగం మరువలేనిదన్న హోంమంత్రి సుచరిత చెప్పారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన జశ్వంత్ కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







