రూ.2500 కోట్ల భారీ డ్రగ్స్ పట్టివేత..
- July 10, 2021
న్యూ ఢిల్లీ: దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు వినియోగం కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. దేశంలోని యువత ముఖ్యంగా డ్రగ్స్‌కు బానిస అవుతున్నట్లు పలు సర్వేలు సైతం కుండబద్దలు కొట్టాయి. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమరవాణా ఎక్కువ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాక్ బోర్డర్ నుంచి అధికంగా పంజాబ్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాపై దృష్టి సారించిన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పకడ్భందీ చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూలేనంతగా భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2500 కోట్ల విలువ చేసే 350కిలలో హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







