నాలుగేళ్ల బాలికను టికెట్ లేకుండా విమానంలో...
- March 09, 2016
నాలుగేళ్ల బాలికను టికెట్ లేకుండా విమానంలో తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించి ఓ మహిళ దొరికిపోయింది. ఆమె చిన్నారి కనబడకుండా బ్యాగ్ లో దాచిపెట్టి ఇస్తాంబుల్ (టర్కీ) నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు విమానంలో తీసుకెళ్లింది. అయితే విమానంలో తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించారు. సంబంధిత మహిళను ఫ్రాన్స్ దేశస్థురాలిగా గుర్తించారు. హైతీకి చెందిన బాలికను దత్తత తీసుకునేందుకు తీసుకెళ్తోంది. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేపట్టినా బ్యాగ్ లోపల పాపను దాచిన విషయాన్ని గుర్తించలేకపోయారు. తనిఖీల నుంచి తప్పించుకున్న ఆ మహిళ విమానంలో పాపను తన కాళ్ల వద్ద ఉంచి దుప్పటి కప్పింది. కాగా ఆ బాలికను టాయ్ లెట్ కు తీసుకెళ్లే సమయంలో ఇతర ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి తెలియజేశారు.ఫ్రాన్స్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ఆ మహిళను, పాపను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







