మహిళా ఉద్యోగులకు ఎయిర్ టెల్ భారీ నజరానా ...
- March 09, 2016
తన సంస్థ మహిళా ఉద్యోగులకు మొబైల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ భారతీ ఎయిర్ టెల్ భారీ నజరానా ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు ఆ సంస్థ ఇచ్చే ప్రసూతి సెలవులను అమాంతం పెంచేసింది. ఇప్పటి వరకు ఆ సంస్థ మహిళా ఉద్యోగులకు 12 వారాలపాటు ప్రసూతి సెలవులు ఇవ్వగా ప్రస్తుతం 22 వారాలకు పెంచింది. తల్లిగా మారనున్న స్త్రీలపై మానసిక ఒత్తిడి తగ్గించడంతోపాటు వారు మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని ప్రకటించింది.దీంతోపాటు ఇప్పటికే గుర్గావ్ లోని తమ కంపెనీ పిల్లల సురక్షిత బాధ్యతలు కూడా ప్రారంభించిందని పేర్కొంది. ఒక వేళ పిల్లలను దత్తతకు తీసుకుంటే ఆ దత్తత తీసుకునే పిల్లల వయసు రెండేళ్లలోపు ఉంటే ప్రసూతి సెలవులు వర్తిస్తాయని, వారికి పన్నెండు వారాలు ఇవ్వడం జరుగుతుందని, అదే రెండేళ్ల వయసు పైబడిన పిల్లలైతే. ఆరు వారాల ప్రసూతి సెలవులు లభిస్తాయని చెప్పారు. పురుష ఉద్యోగులకు అయితే వారం రోజులపాటు సెలవులు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







