హైదరాబాద్ లో ప్రారంభమైన ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు

- July 11, 2021 , by Maagulf
హైదరాబాద్ లో  ప్రారంభమైన  ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు

హైదరాబాద్: తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు అయ్యాయి. లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌  పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నెల 25న సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, తర్వాత ఆగస్టు 1న లాల్ దర్వరాజ మహంకాళి అమ్మవారి బోనాలు భారీగా జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఈ బోనాల ఉత్సవాలకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా చత్తీస్ గఢ్,మహా ష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు హాజరవుతారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com