దుబాయ్ లో రికార్డులు కొడుతున్న తెలుగు బుడత
- July 11, 2021
దుబాయ్: దుబాయ్ లో నివసిస్తున్న క్రితిక్ తంగిరాల 4 సంవత్సరాల 5 నెలలు వయస్సు గల తెలుగు బాలుడు అబ్బురపరిచే రికార్డులు సాధిస్తున్నాడు.తెలుగు బాలుడు క్రితిక్ తల్లిదండ్రులు డాక్టర్ రవితేజ, డాక్టర్ లక్ష్మిలలిత దుబాయ్‌లో నివసిస్తున్నారు.దుబాయ్ లో ఉంటున్న ఈ బుడతడు తెలుగింటి సంప్రదాయాలు, సంస్కృత శ్లోకాల పఠనం పై మక్కువ కనబరుస్తున్నాడు.

దుబాయ్ బ్రైట్ రైడర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎల్కేజీ చుదువుతూ ఆధ్మాత్మిక, భౌగోళిక, ఖగోళ అంశాల్లో విజ్ఞానంతో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించాడు.చిన్నారి క్రితిక్ 105 దేశాల రాజధానులు, 4 సంస్కృత శ్లోకాలు,1 నుంచి 100 నంబర్లు, ఖండాల వర్ణన, సౌర కుటుంబం సంక్షిప్త ప్రసంగంతో ఈ ఏడాది జూన్ 26వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లిషు అక్షరాలను అవరోహణలో (Z నుంచి A వరకు) 6 సెకన్లలో వల్లించి దుబాయ్ ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.క్రితిక్ యూట్యూబ్ ఛానల్ కు https://www.youtube.com/user/tingari2383 సబ్‌స్క్రైబ్ అయ్యి ప్రోత్సహించండి అంటూ తెలుగు కమిటీ ని కోరిన క్రితిక్ తల్లి తండ్రులు.


తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







