60 ఏళ్లు నిండిన ప్రవాసీయులపై త్వరలోనే నిర్ణయం?

- July 12, 2021 , by Maagulf
60 ఏళ్లు నిండిన ప్రవాసీయులపై త్వరలోనే నిర్ణయం?

కువైట్: 60 ఏళ్లు, అంతకుమించి వయసున్న ప్రవాసీయుల సమస్య పరిష్కారం దిశగా కువైట్ ఫోకస్ చేస్తోందని ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. హై స్కూల్ క్వాలిఫికేషన్, అంతకంటే తక్కువ విద్యార్హత ఉండి 60 ఏళ్లు నిండిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేస్తూ కువైట్ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో కువైట్లో ఉంటున్న వృద్ధ ప్రవాసీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే..వారి సమస్య పరిష్కారానికి మానవ వనరుల శాఖ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్, వాణిజ్య, పారిశ్రామిక మంత్రి అబ్దుల్లా అల్ సల్మాన్ సమర్పించనున్న పరిష్కారం కోసం కేబినెట్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి రిపోర్ట్ పై కేబినెట్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొని 60 ఏళ్ల వయసున్న ప్రవాసీయుల సమస్యకు ఓ పరిష్కారం దొరికే అవకాశాలన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com