తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధర్నా
- July 12, 2021
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరసన తెలపడానికి పీసీసీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఎడ్లబండి మీద వచ్చారు. అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, ఇతర మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్ ఇతర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో నిరసనలో పాల్గొన్నారు.

వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిర్మల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. మహబూబ్ నగర్లోనూ పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఎడ్లబండ్లతో పాటు సైకిళ్లతో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సైకిల్, బండి ర్యాలీలో నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఎడ్లబండ్ల ఎక్కి అక్కడి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







