భారత్ - యూఏఈ ప్రయాణం పై అప్డేట్

- July 12, 2021 , by Maagulf
భారత్ - యూఏఈ ప్రయాణం పై అప్డేట్

యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్. ఈ క్రమంలో, జులై 21 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది ఎమిరేట్స్. అంతేకాదు..గత 14 రోజుల్లో భారత్ కు వెళ్లిన వారికి...ఇతర ఏ దేశం మీదుగానైనా యూఏఈకి వచ్చేందుకు అనుమతి నిరాకరించబడుతుందని వెల్లడించింది. అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది. 

ఇదిలాఉంటే...భారత్ నుంచి ప్రయాణాల ఆంక్షలు ఉండటంతో యూఏఈకి వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి నేరుగా అనుమతి లేకపోవటంతో ఇతర దేశాలకు వెళ్లి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత యూఏఈ వెళ్లాల్సి వస్తోంది. విమానాల రద్దుతో భారత్ లో చిక్కుకున్న వాళ్లంతా తమ ఉద్యోగాలను కొల్పోకముందే యూఏఈ చేరుకునేందుకు ఎక్కువగా అర్మేనియా, బహ్రెయిన్ మీదుగా వెళ్తున్నారు. అయితే..కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అర్మేనియా కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. దీంతో భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కుచించుకుపోతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com