ప్రయాణీకులకు ప్రత్యేక సూచనలు చేసిన హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
- July 12, 2021
దోహా: హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ప్రయాణీకులకు ప్రత్యేక సూచనలు చేసింది. విమాన ప్రయాణానికి మూడు గంటల ముందుగా చెక్ ఇన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని, తద్వారా ప్రయాణం సులభతరమవుతుందని పేర్కొంది. ఎహ్తెరాజ్ అప్లికేషన్ ద్వారా గ్రీన్ స్టేటస్ కలిగినవారు లేదా పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ సర్టిఫికెట్ 72 గంటల ముందుగా పొందినవారిని మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సెల్ఫ్ సర్వీస్ చెక్ ఇన్ మరియు బ్యాగ్ డ్రాప్ సౌకర్యాలు అందుబాటులో వుంటాయి. వీటి ద్వారా సులభతరంగా తమ ప్రయాణానికి ప్రయాణీకులు సన్నద్ధమవ్వొచ్చు. కేవలం ప్రయాణీకులను మాత్రమే టెర్మినల్ భవనంలోకి అనుమతిస్తారు. ప్రయాణానికి 60 నిమిషాల ముందు చెక్ ఇన్ నిలిపివేయడం జరుగుతుంది.నిషేధిత వస్తువులు లిక్విడ్స్, ఏరోసోల్స్, జెల్స్.. మొబైల్ పోన్ల కంటే పెద్దవైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వంటివి తమవద్ద లేకుండా ప్రయాణీకులు చూసుకోవాలి. లిథియం బ్యాటరీలు, హోవర్ బోర్డులు కూడా నిషేధం. హెచ్ఐఎ ఖతార్ మొబైల్ యాప్ ప్రయాణీకులు డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







