ప్రయాణీకులకు ప్రత్యేక సూచనలు చేసిన హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం

- July 12, 2021 , by Maagulf
ప్రయాణీకులకు ప్రత్యేక సూచనలు చేసిన హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం

దోహా: హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ప్రయాణీకులకు ప్రత్యేక సూచనలు చేసింది. విమాన ప్రయాణానికి మూడు గంటల ముందుగా చెక్ ఇన్ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలని, తద్వారా ప్రయాణం సులభతరమవుతుందని పేర్కొంది. ఎహ్తెరాజ్ అప్లికేషన్ ద్వారా గ్రీన్ స్టేటస్ కలిగినవారు లేదా పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ సర్టిఫికెట్ 72 గంటల ముందుగా పొందినవారిని మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సెల్ఫ్ సర్వీస్ చెక్ ఇన్ మరియు బ్యాగ్ డ్రాప్ సౌకర్యాలు అందుబాటులో వుంటాయి. వీటి ద్వారా సులభతరంగా తమ ప్రయాణానికి ప్రయాణీకులు సన్నద్ధమవ్వొచ్చు. కేవలం ప్రయాణీకులను మాత్రమే టెర్మినల్ భవనంలోకి అనుమతిస్తారు. ప్రయాణానికి 60 నిమిషాల ముందు చెక్ ఇన్ నిలిపివేయడం జరుగుతుంది.నిషేధిత వస్తువులు లిక్విడ్స్, ఏరోసోల్స్, జెల్స్.. మొబైల్ పోన్ల కంటే పెద్దవైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వంటివి తమవద్ద లేకుండా ప్రయాణీకులు చూసుకోవాలి. లిథియం బ్యాటరీలు, హోవర్ బోర్డులు కూడా నిషేధం. హెచ్‌ఐ‌ఎ ఖతార్ మొబైల్ యాప్ ప్రయాణీకులు డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com