అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సహా 298 మంది అరెస్ట్

- July 13, 2021 , by Maagulf
అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సహా 298 మంది అరెస్ట్

సౌదీ: అవినీతికి పాల్పడినందుకు 298 మంది పౌరులు, ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ(నాజాహా) అధికారులు వెల్లడించారు. అరెస్టైన వారిలో 9 మంత్రిత్వ శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది. డిఫెన్స్, అంతర్గత మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, గ్రామీణ& పురపాలక& గృహ శాఖ, ఇస్లామిక్ అఫైర్స్, విద్య, మానవ వనరులు & సాంఘిక సంక్షేమ శాఖ, విద్యుత్, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఉన్నారు. వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అధికారులు వివరించారు. మొత్తం 340 చోట్ల తనిఖీలు నిర్వహించామని, 999 మందిని విచారించి అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన తర్వాత 298 మందిని అరెస్ట్ చేశామని నాజాహా అధికారులు తెలిపారు. తమ విధులు నిర్వహించేందుకు ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని నాజాహా ప్రజలను కోరింది. టోల్ ఫ్రీ నంబర్ 980, వెబ్‌సైట్ www.nazaha.gov.sa, ఈ-మెయిల్ 980 @ nazaha.gov.sa, ఫ్యాక్స్- 0114420057 ద్వారా తమకు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com