స్పుత్నిక్-వి : త్వరలో కమర్షియల్ లాంచ్ - డా.రెడ్డీస్...
- July 13, 2021
న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్లు విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత అనేక విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ లతో పాటు.. స్పుత్నిక్ - వి కి అనుమతి లభించింది.
అయితే ఇది చాలా రోజులవుతున్నా స్పుత్నిక్ - వి ఇంకా అందుబాటులోకి రాకపోవడంమీద తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ఓ కీలక ప్రకటన చేసింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి కమర్షియల్ లాంచ్ నిలిచిపోలేదని స్పష్టం చేసింది.
రాబోయే వారాల్లో వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని పేర్కొంది.
కాగా 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని భావిస్తున్న స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ ను మే 14న సాఫ్ట్ పైలట్ ప్రాతిపదికన డాక్టర్ రెడ్డీస్ భారత్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో స్థానికంగా ఉత్పత్తి చేసిన దిగుమతి చేసుకున్న 100 మిలియన్ల స్పుత్నిక్ వి డోసులను అందించాలని భారత ప్రభుత్వం ఆశిస్తోంది.
దేశవ్యాప్తంగా స్పుత్నిక్ - వి సాఫ్ట్ లాంచ్ దేశంలోని 50 కి పైగా నగరాలు, పట్టణాలకు చేరుకుందని, రాబోయే వారాల్లో ఇది రష్యన్ వ్యాక్సిన్ వాణిజ్య రోల్-అవుట్ ను బలోపేతం చేస్తుందని తెలిపింది.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మొదట్లో హైదరాబాద్‌లో ప్రారంభించిన స్పుత్నిక్ - వి సాఫ్ట్ లాంచ్ రోల్-అవుట్ ఇప్పుడు వేగంగా పెరిగి అనేక భారతీయ నగరాలకు చేరుకుంది.
"డాక్టర్ రెడ్డీస్ ఈ ప్రయోజనం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆసుపత్రులతో టై అప్ అయి ఉన్నారు. వీరంతా స్పుత్నిక్ - వి కమర్షియల్ లాంచ్ ను విజయవంతంగా చేస్తారు" అని ఒక ప్రకటనలో తెలిపింది.
స్పుత్నిక్ వి సెకండ్ డోస్ కొరత, కమర్షియల్ రోల్-అవుట్ ఆలస్యం అవుతుందనే నివేదికల మధ్య డాక్టర్ రెడ్డిస్ ఈ స్పష్టతనిచ్చింది. ఈ సాఫ్ట్ లాంచ్ కింద కంపెనీ దేశంలోని ఆసుపత్రులకు 1.95 లక్షలకు పైగా మోతాదులను అందించినట్లు గమనించాలి.
వాస్తవానికి జూన్ మధ్యకాలానికే పూర్తిస్థాయిలో రోల్-అవుట్ ప్లాన్ చేసింది. అయితే ఈ సంస్థకు ఇప్పటివరకు సుమారు 30 లక్షల మొదటి డోస్ లను, 3.60 లక్షల రెండవ డోస్ లను అందుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







