గమనిక: ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు, గెజిట్ నోటిఫికేషన్

- July 13, 2021 , by Maagulf
గమనిక: ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు, గెజిట్ నోటిఫికేషన్

తెలంగాణ: వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలనగానే రెండు జిల్లాల ప్రజలూ తరచూ గందరగోళానికి గురయ్యారు. దీంతో పేర్లను మార్చాలన్న డిమాండ్ గత నాలుగున్నరేళ్ల నుంచీ ఉంది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పేర్లను మార్చారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై వరంగల్ అర్బన్ హన్మకొండ జిల్లా గానూ, వరంగల్ రూరల్ జిల్లా ఇకపై వరంగల్ జిల్లా గానూ ఉండనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిపాదన మేరకు ఇవాళ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. 

హన్మకొండ జిల్లాలో హన్మకొండ, పరకాల డివిజన్లు ఉంటాయని, మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని హన్మకొండ జిల్లా కేంద్రంగా పరిగణిస్తారని వివరించింది. ఇక వరంగల్ జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉంటాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com