తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి జరిమానా విధించిన హైకోర్టు..
- July 13, 2021తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల తన లగ్జరీ కారు దిగుమతి చేసుకున్నందుకు పన్ను మినహాయింపు కోరుతూ… పిటిషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొందరు స్టార్ హీరోలు పన్ను చెల్లించేందుకు వెనుకాడుతున్నారని.. హైకోర్టు వ్యాఖ్యనించింది.
తమిళ్ స్టార్ విజయ్ దళపతికి కార్లు అంటే అమితమైన ఇష్టం. పాత కాలపు వాహనాలతోపాటు.. బీఎమ్‌డబ్ల్యూ మినీ కాపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఎ8, రోల్స్ రాయిస్ ఘెస్ట్ వంటి కార్లు విజయ్ దగ్గర ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్‌ను దిగుమతి చేసుకున్నాడు విజయ్. అయితే ఈ కారును దిగుమతి చేసుకున్నందుకు గానూ… పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలాగే కారుకు పన్ను కట్టనందుకు రూ. లక్ష జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు