భారత్ లో కరోనా కేసుల వివరాలు

- July 14, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో క్ర‌మంగా క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి. వేగంగా వ్యాక్సిన్లు  వేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం.నిన్న‌టి రోజున క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. అయితే, ఈరోజు స్వ‌ల్పంగా కేసులు పెరిగిన‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. తాజా బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,46,974కి చేరింది. ఇందులో 3,01,04,720 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,29,946 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 624 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,11,408కి చేరింది.ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో 41,000 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  దేశంలో 24 గంట‌ల్లో 37,14,441 మందికి టీకాలు వేసిన‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 38,76,97,935 మంది ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ ను అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com