దత్తత తీసుకున్న గ్రామానికి ప్రకాష్‌రాజ్ దేవుడు
- March 10, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో మెస్సెజ్ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చాయి. కానీ గత సంవత్సరం కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం మాత్రం చాలా విభిన్నమైన రీతిలో తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారిందరినీ కదిలించింది. ఈ చిత్రంలో 'ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం..మరి ఊరికోసం కొంతైనా చేయాలి కదా..లేకుండా లావైపోతాం' అన్న మెసేజ్ చాలా మంది సెలబ్రెటీలను మనసు కదిలించింది. ఊరి కోసం ఎంతో కొంత చేయాలని ముందుకు వచ్చారు..ఇందులో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు ఇలా ఊరిమీద అభిమానం ఉన్నావాళ్లు చాలా మంది ఊర్లను దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చారు.
అంతే కాదు కొంత మంది ఆ పనిమీదే నిమగ్నం అయ్యారు. ఈ విషయంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలానికి చెందిన కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్‌రాజ్ అక్కడి జనాల పాలిట దేవుడయ్యారు. దత్తత తీసుకుంటే ఏదో ఊరికి వచ్చాం రెండు ఫోటోలు దిగాం ఏదో చిన్న పని చేసి పోయామన్నట్లు కాకుండా ఆ ఊరి జనానికి శాశ్వతంగా పనికొచ్చే పనులకి ప్రకాష్‌రాజ్ శ్రీకారం చుట్టారు. వారితో పొదుపు పథకాలు మొదలు పెట్టించడమే కాకుండా, ఆ ఊరిలో మద్యం షాపు అనేదే లేకుండా చేసారు. రెండెకరాల భూమిలో పిల్లల కోసం ప్రాథమికోన్నత పాఠశాల నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. ఆ ఊరి ఆడవాళ్లు ఎవరూ బహిర్భూమికి ఆరు బయట వెళ్లాల్సిన అవసరం లేకుండా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. బోర్లు వేసినా నీళ్లు పడని భూములు కావడంతో నీళ్లు ఉన్న చోటికే వెళ్లి ఆ ట్యాంకర్లు ఊరందరికీ మంచినీళ్లు సరఫరా చేస్తున్నాయి. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం, పది రోజులకోసారి కొండారెడ్డిపల్లికి స్వయంగా వెళ్లి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. తాను లేనపుడు అక్కడి ప్రజల అవసరాలు తీర్చడానికి ఒక మనిషిని నియమించారు. దేశంలో ఎంతో మంది డబ్లులున్న వారు ఉన్నారు..కానీ ఇలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ ఊరి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఆ ఊరి ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇక శ్రీమంతుడు చిత్ర కథానాయకుడు మహేష్ బాబు కూడా రెండు ఊర్లు దత్తత తీసుకున్నారు..అంతే కాదు కొద్దిమంది సెలబ్రెటీలు దత్తత తీసుకన్నారు కానీ ఇంతగా ఆదరణ పోందలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







