ఈ ఏడాది గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం
- July 16, 2021
సౌదీ: సౌదీ ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోంది. జూన్ మాసానికి సంబంధించి ద్రవ్యోల్బణ రేటు 6.2 శాతానికి చేరింది. ఈ ఏడాదికిగాను ఇదే అత్యధిక స్థాయి కావటం గమనార్హం. చమురు, అహార పదార్ధాల ధరల్లో పెరుగుదల చోటు చేసుకోవటమే ఇందుకు కారణమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. స్టాటిస్టిక్స్ జనరల్ అథారిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మేలో సౌదీ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా నమోదైంది. ధరల పెరుగుదలకు వ్యాట్ కూడా ఓ కారణంగా మారింది. గతేడాది జులైకి ముందు వ్యాట్ 5 శాతం మాత్రమే ఉండేది. కానీ, జులైలో వ్యాట్ పర్సెంటేజ్ ను 5 శాతం నుంచి 15 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ ఏడాది సౌదీ ద్రవ్యోల్బణంలో మరింత పెరుగుదల ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 6.3 శాతానికి చేరొచ్చని చెబుతున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







