రోజుకు రూ.150లు ఆదా చేస్తే.. రూ. 20 లక్షలు..!

- July 16, 2021 , by Maagulf
రోజుకు రూ.150లు ఆదా చేస్తే.. రూ. 20 లక్షలు..!

భారత్: ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ సంస్థలో పెట్టుబడి పెడితే భద్రతకు భరోసా ఉంటుంది.మీ డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్‌కు సంబంధించిన పధకం PPF కూడా ఒకటి. ఇందులో రోజుకు రూ.150లు.. అంటే నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.54వేలు అవుతుంది. మీరు సేవింగ్ పీరియడ్ 20 ఏళ్లు ఎంచుకుంటే అప్పుడు మీరు దాచుకున్న మొత్తం రూ.10.8 లక్షలు అవుతుంది. మళ్లీ దీనిపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే మీకు 20 ఏళ్లకు ఏకంగా రూ.20 లక్షలకు పైగా లభిస్తాయి. మీరు రూ.100లతో కూడా పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. పీపీఎఫ్ ఖాతాపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సాధారణంగా పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. ఈ పీరియడ్‌ని 5 ఏళ్లు చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. పీపీఎఫ్ అకౌంట్‌లో ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com