హెల్తీ బ్రోకలీ
- July 16, 2021
కావలసిన పదార్ధాలు: బ్రోకలీ 1, సెనగపిండి 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన ౩ పచ్చి మిరపకాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, కారం పావు స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ.
తయారు చేయు విధానం: ముందర బ్రోకలీ ని శుభ్రం గా కడిగి, చిన్న చిన్న గుత్తులు గా కొయ్యండి. తర్వాత ఒక గిన్నె లో 2 లీటర్లు నీరు ని మరిగించి, మరుగుతన్న నీటిలో బ్రోకలీ ని 3 నిమిషాలు ఉడికించండి. ఆ నీటిని పారబోసి బ్రోకలీ పైన ఫ్రిడ్జ్ లోని చల్లని నీరు పోసి వేడి తగ్గేంత వరకు ఉంచండి. స్టవ్ పైన బాణీ లో శనగపిండిని 2 నిమిషాలు కమ్మని వాసన వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చెయ్యండి. అది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీల కర్ర పొడి 2 నిమిషాలు కమ్మని వాసన వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చెయ్యండి, అది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణీ లో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి దాంట్లో తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిమిషం వేయించండి, తర్వాత బ్రోకలీ వేసి అర నిమిషం వేయించి అప్పుడు కారం, సెనగపిండి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఇంకొక అర నిమిషం వేయించాక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి గా రొట్టెల తో కానీ రైస్ తో కానీ తినచ్చు.
తాజా వార్తలు
- 5 అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్లు
- నేటి నుండి ఏపీ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- ఒమన్‌లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- ముసందమ్లో భూకంపం
- ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖపట్నం ... బాంబు పేల్చిన సీఎం జగన్..!
- దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!