ఈద్ అల్ అదా సెలవులు: 120 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరించిన దుబాయ్ పోలీస్
- July 16, 2021
దుబాయ్: ఈద్ అల్ అధా సెలవుల జోష్ నేపథ్యంలో సంబరాలకు ప్రజలు సిద్ధమవుతున్న వేళ దుబాయ్ ట్రాఫిక్ పోలీస్, పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరించడం జరుగుతోంది. మొత్తం 120 ట్రాఫిక్ పెట్రోల్స్ వినియోగించి, వాహనదారుల భద్రతని రోడ్లపై వెళ్లేవారి భద్రతనీ పరిరక్షించనున్నాయి. ప్రముఖ పర్యాటక, మరియు వాణిజ్య ప్రాంతాలైన దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్, జెబిఆర్, సిటీ వాక్, షేక్ మహ్మద్ బిన్ రషిద్ బిఎల్వీడీ, ఫెస్టివల్ సిటీ, మిర్దిఫ్ సిటీ సెంటర్, లా మిర్, కైట్ బీచ్, ఎయిర్ పోర్టు ఎస్టీ, అల్ సీఫ్ ఎస్టీ, షేక్ మహ్మద్ బిన్ జాయిద్ రోడ్, ఎమిరేడ్స్ రోడ్, దుబాయ్ అల్ ఐన్ రోడ్, అల్ ఇతిహాద్ రోడ్, అల్ ఖలీజ్ ఎస్టీ, అల్ ఖుద్స్ ఎస్టీ, అమాన్ ఎస్టీ, అకడమిక్ ఎస్టీ రస్ అల్ ఖోర్ ఎస్టీ మరియు జుమైరా ఎస్టీ వంటి చోట్ల పెట్రోల్స్ మోహరిస్తారు. కోవిడ్ 19 నిబంధనలను ప్రతి ఒక్కరూ పాఠించాలనీ, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, పాద చారులు ఇంకా జాగ్రత్తగా ఉండాలని కల్నల్ సువైదీన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







