టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
- July 19, 2021
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రేవంత్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఆయనను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తెల్లవారుజామునే చేరుకున్న పోలీసులు అక్కడి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఈ ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కూడా కోకాపేట భూముల సంద్శనకు వెళ్లడానికి సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భూముల సందర్శనకు వెళ్లే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు భారీగా మోహరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







