స్పాన్సర్ ను పొడిచిన కేసులో ప్రవాసీయుడి అరెస్ట్
- July 20, 2021కువైట్: మూడు నెలల క్రితం తన స్పాన్సర్ పై హత్యాయత్నం చేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు కువైట్ పోలీసులు. సాధారణంగా నిర్వహించే సెక్యూరిటీ చెక్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నిందితుడు తారసపడ్డాడు. అతని తీరు అనుమానస్పదంగా ఉండటంతో మరింత లోతుగా అతన్ని ఎంక్వైరీ చేశారు. అతని దగ్గర్నుంచి సేకరించిన వివరాలతో తాను బంగ్లాదేశీ డ్రైవర్ అని, ఓ మహిళా స్పాన్సర్ పై హత్యాయత్నం కేసులో వాంటెడ్ గా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. మహిళా స్పాన్సర్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్న నిందితుడు..ఆమె శరీరంపై పలు చోట్ల పొడిచి గాయపరిచాడు. అయితే..సకాలంలో ఆమెను ఆస్పత్రిలో చేర్చటంతో చికిత్స తర్వాత కోలుకుంది. అప్పటి నుంచి హత్యాయత్నం కేసులో నిందితుడైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు సెక్యూరిటీ చెకింగ్ లో పట్టుబడ్డాడు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్