భారత్ కు 75 లక్షల మోడర్నా వ్యాక్సిన్లు
- July 20, 2021
న్యూఢిల్లీ: భారత్ కు 75 లక్షల మోడర్నా కరోనా వ్యాక్సిన్ లను అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. సంస్థ చేపట్టిన కొవ్యాక్స్ కార్యక్రమం కింద వాటిని సరఫరా చేస్తామన్నారు. దేశంలో ‘ఇండెమ్నిటీ’ బాండ్ కు సంబంధించిన సమస్య క్లియర్ అయ్యాక, టీకా డోసుల స్టాక్ ను బట్టి వాటిని భారత్ కు పంపిస్తామని డబ్ల్యూహెచ్ వో ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో.. ఈ 75 లక్షల వ్యాక్సిన్ లు ఎప్పుడొస్తాయన్న దానిపై స్పష్టత లేకుండాపోయింది.
మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతులపై డబ్ల్యూహెచ్ వో సమీక్ష చేస్తోందని పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ప్రీ సబ్ మిషన్ సమావేశం పూర్తయిందని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







