కోళ్లకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన ఘటనలే దిగుమతులపై కువైట్ నిషేధం..
- March 10, 2016
భారత్ నుంచి జరుగుతున్న పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై కువైట్ నిషేధం విధించింది. ఇటీవల దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన ఘటనలే ఇందుకు కారణం. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న గుడ్లుపెట్టే కోళ్లు, మాంసపు కోళ్లు, పొదుగుడు గుడ్లపై ఇంతకుముందు విధించిన నిషేధాన్ని కువైట్ పిఎఎఎఫ్ఆర్ (పబ్లిక్ అథారిటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్) గత అక్టోబర్‌లోనే తొలగించింది. అయితే ఇటీవల త్రిపురలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన ఉదంతం వెలుగులోకి రావడంతో భారత్ నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై కువైట్ మళ్లీ నిషేధం విధించిందని ప్రభుత్వం అధికారిక నోటీసులో వెల్లడించింది.భారత పౌల్ట్రీ ఉత్పత్తులు ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలకే ఎగుమతి అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో భారత్ నుంచి కువైట్ 1.20 లక్షల డాలర్ల విలువచేసే 24.2 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 2014-15 తొలి మూడు త్రైమాసికాల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) మన దేశం నుంచి మొత్తం రూ.484 కోట్ల విలువైన పౌల్ట్రీ ఎగుమతులు జరగ్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.584 కోట్లకు పెరిగాయి. అయితే ప్రస్తుతం కువైట్‌లో విధించిన నిషేధం వలన మున్ముందు మన దేశ పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







