టీచ్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వహించిన సెలబ్రిటీస్ షో
- March 10, 2016
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ కార్యక్రమం గురువారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించేందుకు 101 డైనింగ్ టేబుల్ వద్ద వినూత్నరీతిలో ఫ్యాషన్ షోను నగర డిజైనర్ శిల్పారెడ్డి నిర్వహించారు. శిల్పా డిజైన్స్ ధరించి నటులు రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచు, ఆదాశర్మ, లావణ్య త్రిపాఠి, సోనల్ చౌహాన్, అడివి శేష్, షర్మిలా మంద్రే, పూనమ్ కౌర్, మధుషాలినీ, ప్రగ్యా జైశ్వాల్, నికోల్ ఫారియా, సంధ్యారాజు, రోహిత్ ఖండేల్‌వాల్ తదితరులు ర్యాంప్‌పై హొయలు పోయారు. పూర్వ మిస్ యూనివర్స్, నటి సుస్మితా సేన్‌తో పాటు నగర సోషలైట్ పింకీ రెడ్డి, పూర్వమంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. చిన్నారులకు మెరుగైన విద్య అందించడం అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు.. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఇంతటి మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం అందించడానికి తానెప్పుడూ సిద్ధమని సుస్మితాసేన్ అన్నారు. ఎంత సంపాదించామన్నది కాదు.. ఏం చేశామన్నదేశాశ్వతం. సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం.. వాటిలో పాల్గొనటం తాను పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని గీతారెడ్డి అన్నారు.-
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







