కువైట్ ముసాఫిర్ యాప్ ను రద్దు చేయటం కుదరదు

- July 22, 2021 , by Maagulf
కువైట్ ముసాఫిర్ యాప్ ను రద్దు చేయటం కుదరదు

కువైట్ సిటీ: అంతర్జాతీయ ప్రయాణికులు కోవిడ్ నేపథ్యంలో తమ ప్రయాణాన్ని సులభతరం చేసుకునేందుకు కువైట్ అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ కువైట్ ముసాఫిర్. 
అయితే..ప్రయాణికులు యాప్ వినియోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ డీజీసీఏ కీలక ప్రకటన విడుదల చేసింది. కువైట్ ముసాఫిర్ కు ప్రత్యామ్నాయంగా ఇతర యాప్ లు ఉంటే ముసాఫిర్ యాప్ ను డిస్ కంటిన్యూ చేసుకోవచ్చని వెల్లడించింది.అదే సమయంలో కువైట్ ముసాఫిర్ యాప్ ను పూర్తిగా రద్దు చేయటానికి మాత్రం సాధ్యం కాదని కూడా స్పష్టం చేసింది. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ముసాఫిర్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవటం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే.. యాప్ వినియోగంలో సమస్యలు తలెత్తకుండా వినియోగదారులకు సులభతరంగా ఉండేలా అప్ డేట్ చేశామన్నారు. కోవిడ్ నేపథ్యంలో కువైట్ తిరిగొచ్చే ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని కువైట్ ముసాఫిర్ యాప్ వివరాలతో సమీక్షించి వారికి అనుమతి ఇవ్వాలో..వద్దో నిర్ణయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు యాప్ ను అప్ డేట్ చేసిన నేపథ్యంలో  ఫ్లైట్ బుకింగ్, వైద్య పరీక్షల వివరాలను అప్ లోడ్ చేసి ప్రయాణికులు సురక్షిత ప్రయాణం చేయాలని డీజీసీఏ కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com