సౌదీలో ఉద్యోగాలు కోల్పోనున్న భారతీయ వలసదారులు
- March 10, 2016
సౌదీ అరేబియా తమ పౌరులకు ఇంకా ఎక్కువగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకోసం తీసుకుంటున్న చర్యలు భారతీయ వలసదారులకు అక్కడ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయి. సౌదీ అరేబియా తాజాగా మొబైల్ ఫోన్ దుకాణాల్లో మూడు నెలల్లోగా వలస కార్మికులు లేదా ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించి, సౌదీ అరేబియా వాసులతో భర్తీ చేయవలసి ఉంటుంది. ఆరు నెలల్లో మొత్తం 100 శాతం సౌదీ అరేబియా వాసులే ఆయా దుకాణాల్లో పనిచేయవలసి ఉంటుంది. సెప్టెంబర్ దీనికి తుది గడువుగా నిర్ణయించారు. మినిస్టర్ ఆఫ్ లేబర్ ముఫ్రెజ్ అల్ హక్‌బానీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ తాజా నిర్ణయంతో సౌదీ అరేబియా వాసులకు మరింతగా ఉద్యోగాలు లభిస్తాయని మినిస్టర్ చెప్పారు. సౌదీ యువత మరియు మహిళలకు ఈ రంగాల్లో శిక్షణ ఇప్పించి, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారాయన. సౌదీ అరేబియా రిటైల్ మరియు సర్వీస్ సెక్టార్‌లో ఎక్కువగా సౌత్ ఇస్ట్ ఆసియా అందులోనూ ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వచ్చినవారే ఎక్కువగా పనిచేస్తున్నారు. సౌదీ పౌరులతో పోల్చితే వీరికి దక్కే వేతనాలు తక్కువ. ప్రైవేట్ సెక్టార్‌లో 10 శాతం సౌదీ జాతీయులకే ఇవ్వాలంటూ 'నితాకత్' నిర్ణయం తీసుకున్నాక పెద్ద 1.41 లక్షల మంది ఇండియన్స్ సౌదీ అరేబియాని విడిచిపెట్టారు. ఈసారి ఇంకా ఎక్కువగా భారతీయులు సౌదీలో ఉద్యోగాలు కోల్పోయి, స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా వలసదారుల్లో 20 శాతం భారతీయులే ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







