ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
- July 23, 2021అమరావతి: సీఎం జగన్ నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని.. అప్పుడే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదు. పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. నాడు-నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదు’’ అని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించిననాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక.. నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. తొలి విడత నాడు-నేడు కింద 15వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దాం. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను.. ఆగస్టు 16న ప్రారంభిస్తాం. విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నాం’’ అని అని తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు