ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
- July 23, 2021
అమరావతి: సీఎం జగన్ నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని.. అప్పుడే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదు. పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. నాడు-నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదు’’ అని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించిననాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక.. నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. తొలి విడత నాడు-నేడు కింద 15వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దాం. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను.. ఆగస్టు 16న ప్రారంభిస్తాం. విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నాం’’ అని అని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







