శివలింగ తమిళ్ లో రీమేక్ చేయడం అంటూ జరిగితే అది రజినినే చేయాలని అంటున్నాడట పి.వాసు
- March 10, 2016
పి.వాసు దర్శకత్వంలో కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా చేసి సూపర్ హిట్ కొట్టిన సినిమా శివలింగ. హారర్ నేపథ్యంతో సాగే ఈ కథ మెచ్చిన తలైవా ఆ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటూ కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే ఆ సినిమా దర్శకుడు వాసు ఇదవరకు రజినితో చంద్రముఖి సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఓ రేంజ్ హిట్ సాధించింది. బాబా ఫ్లాప్ తో కెరియర్ అంతా అవకతవకలున్న రజిని చంద్రముఖి సినిమాతో మళ్లీ తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ఆ సినిమా నుండి రజినిని ఆపడం ఎవరి వల్లా కాలేదులేండి. అయితే ప్రస్తుతం లింగా ఫ్లాప్ తో మళ్లీ కెరియర్ కష్టాల్లో ఉన్న రజిని ప్రస్తుతం కబాలి, రోబో-2 సినిమాలు చేస్తున్నా కన్నడ శివలింగ మీద కూడా ఓ కన్నేశాడని తెలుస్తుంది.
ఇప్పటికే ఆ సినిమా చేయాల్సిందిగా వాసు రజినితో చర్చలు జరుపుతున్నాడట కూడా. కన్నడలో హిట్ అయిన శివలింగ సినిమా కచ్చితంగా తమిళ ప్రేక్షకుల మనసు కూడా గెలుచుకుంటుంది అని అభిప్రాయపడుతున్నాడు దర్శకుడు పి.వాసు. అయితే ఇప్పటికే లింగా అనే పేరుతో తీసిన సినిమా గురించి ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా చేసిన గొడవల వల్ల ఇంకా అపవాదాలు మోస్తున్న రజిని మళ్లీ శివలింగా పేరుతో సినిమా తీస్తాడా అని డౌట్ పడుతున్నారు అభిమానులు. ఏది ఏమైనా కన్నడలో సూపర్ హిట్ అయిన శివలింగ తమిళ్ లో రీమేక్ చేయడం అంటూ జరిగితే అది రజినినే చేయాలని అంటున్నాడట పి.వాసు మరి వాసు మాట కాదనలేక రజినికాంత్ ఆ సినిమా చేస్తాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. అది కాక రజిని ఒకవేళ ఆ సినిమా ఓకే చేసినా మరో సంవత్సరం దాకా కమిట్ అయిన సినిమాల కోసం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







