కొత్త సీఎస్ఐ చర్చి కోసం 500,000 దిర్హాముల విరాళమిచ్చిన యూసుఫ్ అలీ
- July 23, 2021
అబుదాబీ: లులు గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ, చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) నిర్మాణం కోసం 500,000 దిర్హాములు విరాళమందించారు. అబుదాబీలో 15,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ చర్చి నిర్మితమవుతోంది. 500,000 దిర్హాముల చెక్, సీఎస్ఐ పరిష్ రెవ లాల్జీ ఎమ్ పిలిప్, అలాగే రెవ డాక్టర్ మలాయిల్ సబూ కోషి చరియన్ తదితరుల సమక్షంలో ఈ చెక్ అందించారు. ఫాదర్ లాల్జీ ఈ సందర్భంగా యుఏఈ నాయకత్వానికి కృతజ్ణతలు తెలిపారు. యూసెఫ్ అలీకి కూడా కృతజ్నతలు తెలిపారు. యూఏఈలో భిన్న దేశాలకు చెందిన, భిన్న మతాలకూ, సంస్కృతులకు చెందిన వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని యూసెఫ్ అలీ చెప్పారు. మినిస్టర్ ఆఫ్ టోలరెన్స్ మరియు కో - ఎడ్జిస్టెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, చర్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఏడాది నవంబరులో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 750 మంది ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







