NRI TRS Kuwait ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు
- July 24, 2021
కువైట్ సిటీ: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టినటువంటి 'ముక్కోటి వృక్షార్చన' లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేసి KTRకి చిరు కానుకను అందించడం జరిగింది.అధ్యక్షురాలు అభిలాష మాట్లాడుతూ... తెలంగాణ లో అభివృద్ధి కేవలం తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని అన్నారు, KTR నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మరియు కమిటీ సభ్యులు రవి గన్నరపు, సురేష్ గౌడ్, జగదీశ్, సుభాన్, రవి సుధగాని, సమియుద్దీన్, జమీల్, దస్తగిర్ తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







