పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడేందుకుగాను ఆ దేశం పెట్టిన షరతును భారత్ తిరస్కరించింది
- March 10, 2016
టి-20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడేందుకుగాను ఆ దేశం పెట్టిన షరతును భారత్ తిరస్కరించింది. భారత్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు సంబంధించి ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వబోమని స్పష్టం చేసింది. శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్టు ఈ మేరకు ప్రకటన చేశారు.భారత్ ఆతిథ్యమిస్తున్న టి-20 ప్రపంచ కప్ లో పాక్ పాల్గొనే విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఈ నెల 19న భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ జరగాల్సివుండగా.. భద్రత కారణాలతో పాటు పాక్ కోరిక మేరకు వేదికను కోల్ కతాకు తరలించారు. అయితే భద్రత గురించి భారత్ రాత పూర్వక హామీ ఇవ్వాలని, అప్పుడే తమ జట్టు ఆ దేశానికి వెళ్తుందని, అప్పటి దాకా పాకిస్తాన్ నుంచి కదలరని ఆ దేశ ప్రభుత్వం షరతు విధించింది.ఇందుకు భారత్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చే విషయంలో స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







