వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఎగబడ్డ జనం..స్వల్ప తోపులాట

- July 25, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఎగబడ్డ జనం..స్వల్ప తోపులాట

కువైట్: కువైట్లోని కొన్ని వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర అధికారులు అంచనా వేయలేదని దృశ్యాలు కనిపించాయి. జనం పెద్దసంఖ్యలో రావటంతో వ్యాక్సిన్ కేంద్రాలు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారమే దీనికి కారణం. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లందరికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం జోరందుకుంది. ఇదే నిజమని నమ్మిన జనం పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తోపులాటలు కూడా జరిగాయి. దీంతో అలర్టైన ఆరోగ్య శాఖ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసింది. ముందస్తుగా రిజిస్టర్ చేసుకొని ఆరోగ్య శాఖ నుంచి మెసేజ్ రూపంలో అపాయింట్మెంట్ పొందిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com