హమద్ ఎయిర్ పోర్టులో వారంలో 3 రాత్రులు ఫ్రీ పార్కింగ్

- July 25, 2021 , by Maagulf
హమద్ ఎయిర్ పోర్టులో వారంలో 3 రాత్రులు ఫ్రీ పార్కింగ్

ఖతార్: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ పాలసీల్లో మార్పులు చేస్తూ వాహనదారులకు ఆఫర్ ప్రకటించింది. విమానాశ్రయానికి వచ్చే ప్రజలకు వారంలో మూడు రాత్రులు ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం, శనివారం, ఆదివారం రాత్రి 10 నుండి ఉదయం 7:30 వరకు వాహనదారులు ఉచిత పార్కింగ్ సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఆగస్ట్ 16 రాత్రి నుంచి ఫ్రీ పార్కింగ్ పాలసీ అమలులోకి రానున్నట్లు హమద్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com