తెలంగాణ: రామప్ప దేవాలయానికి UNESCO గుర్తింపు

- July 25, 2021 , by Maagulf
తెలంగాణ: రామప్ప దేవాలయానికి UNESCO గుర్తింపు

తెలంగాణ: వరంగల్‌ రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది.వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌ గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపిక కాగా..భారత్ నుంచి 2020 ఏడాదికి రామప్పకు మాత్రమే ఈ స్థానం దక్కింది.రామప్పకు అంతర్జాతీ గుర్తింపు రావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com