2 మిలియన్ బహ్రెయినీ దినార్ల మనీ లాండరింగ్: అన్నదమ్ముల అరెస్ట్
- July 26, 2021
బహ్రెయిన్: ఇద్దరు వ్యక్తులు మనీ ల్యాండరింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా వారి భవిష్యత్తు ఈ శుక్రవారం తేలనుంది. ఇద్దరూ అన్నదమ్ములు. 2 మిలియన్ బహ్రెయిన్ దినార్ల మనీ ల్యాండరింగ్‌కి నిందితులు పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీరికి న్యాయ స్థానం 5 ఏళ్లు శిక్ష విధించగా, ఆ శిక్షను అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్‌పై తీర్పు శుక్రవారం రానుంది. నిందితులు బాధితులను ప్రలోభపెట్టి, పెద్ద మొత్తంలో డబ్బును వారి నుండి సేకరించారు. కొన్ని నెలల పాటు, లాభాలు వచ్చినట్టుగా చెప్పి, కొంత సొమ్మును బాధితులకు తిరిగిచ్చారు కూడా. నమ్మకం పెరగడంతో మరికొంతమంది వీరిని నమ్మి, నిందితులకు మరికొంత డబ్బు అందించారు. అలా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన నిందితులు జెండా ఎత్తేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







