ఒమన్: 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- July 27, 2021
మస్కట్: దేశ ప్రజల్లో దాదాపు 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల మేరకు గత ఆదివారం (జులై 25) నాటికి దేశవ్యాప్తంగా 19,26,307 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే మొత్తం లక్ష్యంగా ఎంచుకున్న గ్రూపులో 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు. అయితే..వ్యాక్సిన్ పొందిన వారిలో 15,87,784 (45శాతం) మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. 3,38,523(10 శాతం) మంది రెండు డోసులు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ లో అన్ని గవర్నరేట్లలో మస్కట్ గవర్నరేట్ రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ అందించింది. గవర్నరేట్ పరిధిలో ఇప్పటివరకు 6,18,264 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









