స్పందన కార్యక్రమం: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
- July 27, 2021
అమరావతి : స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతంపై దిశానిర్దేశం చేయనున్నారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఖరీఫ్ సన్నద్ధత, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అందుబాటుపై సమీక్ష చేపట్టారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్‌లు.. బీఎంయూల నిర్మాణ ప్రగతిపై సీఎం జగన్ సమీక్షిస్తారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై దిశానిర్దేశం చేయడంతో పాటు.. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీల తీరును అధికారులను అడిగి తెలుకోనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







