భారత జట్టులో కరోనా కలకలం

- July 27, 2021 , by Maagulf
భారత జట్టులో కరోనా కలకలం

కొలంబో: భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శివారు ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఇక ఈరోజు భారత్-లంక ల మధ్య రెండో పొట్టి మ్యాచ్ జరగాల్సి ఉండగా తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో భారత బృందం మొత్తం ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి మరో ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను నిర్వహిస్తారా.. లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి. అయితే మిగితా భారత ఆటగాళ్లకు అందరికి నెగెటివ్ గా నిర్ధారణ అయితే ఈ మ్యాచ్ ను యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com