ఆ మృతదేహం ఎవరిది..? ప్రవాసీయుల సాయం కోరిన పోలీసులు
- July 28, 2021
దుబాయ్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి దేశంగానీ దేశంలో ఊపిరి వదిలాడు. కానీ, అతను ఎవరో తెలియదు. ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు.ఎడారి ప్రాంతంలో మృత్యుఒడికి చేరి అనాధ శవంలా మిగిలిపోయాడు. అయితే...అతని వివరాలను తెలుసుకునేందుకు దుబాయ్ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముహైసినా ప్రాంతంలో ఇసుక తిన్నెల్లో ఆసియన్ మృత దేహం లభించిందని, అయితే..తాను ఎవరనే విషయం తెలియటం లేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి గుర్తింపు పత్రాలు పోలీసులకు దొరకలేదు. ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో మృతుడిని గుర్తించటంలో సహాయపడాలని ప్రవాసీయులను కోరారు దుబాయ్ పోలీసులు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







