బంగాళాఖాతంలో అల్పపీడనం
- July 28, 2021
తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. మరోవైపు తాజాగా ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవి రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో పశ్చిమ దిశలోని పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
అల్పపీడన ప్రభావం కోస్తాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కదలికలో మందగమనం కొనసాగనున్నందున ఎండ తీవ్రత పెరగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, గురువారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







