టోక్యో ఒలింపిక్స్: ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు
- July 28, 2021
టోక్యో ఒలింపిక్స్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. మరో సులభమైన విజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు సింధు.. 21-9, 21-16తో హాంకాంగ్ ప్లేయర్ చేంగ్ న్గాన్‌ను వరుస గేమ్‌లలో ఓడించి, సిరీస్‌లో మరో అడుగు ముందుకు వేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ అప్రతిహత విజయాలతో దూసుకుని పోతుంది పీవీ సింధూ.
గ్రూప్ జేలో ఉన్న సింధు.. ఆదివారం మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ షట్లర్‌తో తలపడిన సింధు.. కేవలం 28 నిమిషాల్లో మ్యాచ్ ముగించి, ఫస్ట్ మ్యాచ్‌లో సత్తా చాటింది. పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది. ఇప్పుడు రెండో గేమ్‌లో కూడా సునాయాశంగా గెలిచింది. ఈ విజయంతో ఆమె మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







