ఏపీలో జాబ్ మేళా.!
- July 28, 2021
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మూడు ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30న అనంతపూర్ లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా APSSDC వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, హైదరాబాద్, అనంతపూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9010039901 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.
-Needs Services Pvt Ltd(Amazon) సంస్థలో 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్, బార్ కోడ్ స్కానింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి. ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 13,140 వరకు వేతనం చెల్లించనున్నారు.
-Fresh Minds సంస్థలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
-FUTURZ(Flipkart): ఈ సంస్థలో మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. టెన్త్/ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 12-26 ఏళ్లు ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం పది గంటలకు నలంద డిగ్రీ కాలేజీ, రామ్ నగర్, అనంతపూర్ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







